Vijay deverakonda: నెక్స్ట్ సినిమా దర్శకుడు ఆయనే..?

Share This :

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత శివ నిర్వాణతో సినిమా చేయబోతున్నట్టు దాదాపు కన్‌ఫర్మ్ అయిందట. ‘నిన్నుకోరి’, ‘మజిలీ’, ‘టక్ జగదీష్’ చిత్రాలతో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న శివ నిర్వాణ – విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ ఉందని గత ఏడాదే ప్రకటన వచ్చింది. అయితే, కరోనా కారణంగా ఈ ప్రాజెక్ట్ డిలే అయింది. దాంతో వీరి కాంబోలో సినిమా క్యాన్సిల్ అయిందనే ప్రచారం జరుగుతోంది. కానీ, అది నిజం కాదట.

‘లైగర్’ పూర్తి చేసిన విజయ్ నెక్స్ట్ సినిమాను శివ నిర్వాణతోనే చేయనున్నారని తాజా సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవర కొండ – అనన్య పాండే జంటగా రూపొందుతున్న ‘లైగర్’ ఈ ఏడాది ఆగస్టు 25న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో పాన్ ఇండియా సినిమాగా 5 భాషలలో విడుదల కాబోతుంది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి.