Kantara film review: నేటివిటీ కథలు విజయం సాధిస్తాయి అని నిరూపించిన ‘కాంతారా’

Share This :

నటీనటులు : రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, కిశోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, మానసి సుధీర్త, షానిల్ గురు, తదితరులు
సినిమాటోగ్రఫీ : అరవింద్ ఎస్. కశ్యప్
సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్‌
రచన, దర్శకత్వం : రిషబ్ శెట్టి
నిర్మాత : విజయ్ కిరగందూర్

కన్నడ సినిమా ‘కాంతారా’ (Kannada film Kantara) ముందుగా కన్నడం లో సెప్టెంబర్ 30 న విడుదల అయింది. అక్కడ పెద్ద విజయం సాధించింది. కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) దీనికి దర్శకుడు, రచయిత మరియు ఇందులో కథానాయకుడు కూడా. సప్తమి గౌడ (Saptami Gowda) కథానాయికగా చేసింది. ఈ సినిమా కన్నడం లో సెన్సేషన్ అయిన తరువాత, ఇప్పుడు తెలుగులో అదే పేరుతో విడుదల అయింది. ఈ సినిమాని మెచ్చుకుంటూ ప్రభాస్ (Prabhas praises Kantara) లాంటి నటుడు మాట్లాడటం, కచ్చితంగా చూడండి అని చెప్పటం ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి ని రేకేతించింది. ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

కథ:

(Kantara story) ఈ కథ మొదలయింది చాల దశాబ్దాలు క్రితం కర్ణాటక లోని ఒక అటవీ ప్రాంతం ఆనుకొని వున్న ఒక గ్రామంలో. అక్కడ రాజుకు ప్రశాంతత లేదని, ఒకసారి అడవికి వెళ్లి అక్కడ ఒక దేవత విగ్రహం చూసిన వెంటనే తనకు చాల ప్రశాంతంగా ఉందని భావిస్తాడు. వెంటనే అక్కడి ప్రజలకు తన భూమి ఇచ్చి వాళ్ళని సాగుచేసుకోమని, కానీ ఆ గ్రామా దేవతని మాత్రం తనకివ్వమని చెప్పి తీసుకెళ్లి తన ఇంటి దగ్గర పెట్టుకుంటాడు. ఇలా ఏళ్ళు గడుస్తున్నాయి, మధ్యలో అదే వంశం లో వచ్చిన ఒక రాజు భూమిని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నం చేయగా, రక్తం కక్కుకొని చచ్చిపోతాడు. గ్రామ ప్రజలు ఆ అడవిని నమ్ముకొని జీవిస్తూ ఉండగా, కొన్నేళ్ల తర్వాత ఆ అడవి, అక్కడ భూములు రిజర్వ్ ఫారెస్ట్‌లో భాగమని, దానిని ఊరి ప్రజలు ఆక్రమించుకున్నారని ఫారెస్ట్ ఆఫీసర్ (కిశోర్) అక్కడ వున్న ప్రజలకు ప్రభుత్వ ఆదేశాలు అని చెప్పి ఇబ్బంది పెడతాడు. అదే ఊరి పెద్ద, అదే రాజుల వంశస్థుడు కూడా తిరిగి తమ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ గ్రామంలో వున్నా ఒక యువకుడు శివ (రిషబ్ శెట్టి) ఫారెస్ట్ ఆఫీసర్‌కి. ఆ గ్రామా పెద్ద కి ఎదురు తిరుగుతాడు. శివకి అప్పుడప్పుడూ కలలోకి ఒక దేవత వచ్చి అతనికి ఎదో చెపుతూ ఉంటుంది. ఆ దేవత ఎవరు? భూములు ఆ గ్రామ పెద్ద తీసుకుంటాడా లేదా వాటికోసం పోరాటం చేస్తున్న శివ విజయం సాధిస్తాడా అన్నది మిగతా కథ.

విశ్లేషణ:


ఈ సినిమాని విశ్లేషించే ముందు సినిమా దర్శకులు, నిర్మాతలు ఒకటి తెలుసుకోవాలి. నేటివిటీ తో వస్తున్నా కథలు చాల పెద్ద ఘాన విజయం సాధిస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’, (RRR) ‘పుష్ప’ (Pushpa), ‘కె జి ఎఫ్’ (KGF) కానీయండి, లేదా మొన్న వచ్చిన ‘బింబిసార’ (Bimbisara), ‘సీతారామం’ (Seetharamam), ‘కార్తికేయ’ (Kaarthikeya) ఇవన్నీ వేరే సినిమాలకు రీమక్స్ కాదు. నేటివిటీ నుండి వచ్చిన కథలు అంటే ఆయా ప్రాంతాల సంస్కృతి, భాష (Local nativity, culture, language and ambience) అక్కడ ప్రజల జీవన విధానం ఆధారంగా వచ్చినవి చాల సినిమాలు. అలాంటిదే ఈ ‘కాంతారా’ సినిమా కూడా. కన్నడంలో ఒక అటవీ ప్రాంతంలో జరిగిన కథ ఇది. అడవి, గ్రామము, పొలాలు, పశువులు ఇవన్నీ సినిమాలో సహజంగా చూపించడటం లో రిషబ్ శెట్టి సఫలం అయ్యాడు. ఈ సినిమా కథ ఏంటి అంటే రాసి చెప్పలేము, వెండి తేర మీద చూడాల్సిందే. అక్కడక్కడా చిన్న చిన్న సాగదీసి సన్నివేశాలున్నా కూడా, ఎక్కడ విసుగు అనిపించకుండా, ఆసాంతం ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాడు రిషబ్ శెట్టి. అతనే కథానాయకుడు, రచయిత, దర్శకుడు అవటం విశేషం. అన్ని సన్నివేశాలు సహజత్వంతో కూడినవిగా చూపిస్తాడు, కథ కూడా అలాగే నడిపిస్తాడు. అప్పట్లో ఉంటే గ్రామా పెద్ద, అతని దగ్గర ఆ అటవీ ప్రాంతం లో వుండే వాళ్ళు ఎలా ఉండేవారు, వాళ్ళ నడవడిక ఇవన్నీ బాగా చూపించాడు.
అలాగే ప్రభుత్వం ఆ అటవీ భూముల్ని స్వాధీనం చేసుకోడానికి వచ్చినపుడు ప్రజలు ఎలా స్పందిస్తారు, వాళ్ళ భావోద్వేగాలు అవన్నీ కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. వాళ్ళు నమ్ముకున్న గ్రామా పెద్దే శివ తమ్ముడు గురువ ని చంపాడని తెలుసుకున్న శివ గ్రామా పెద్ద ఇంటికి వెళ్లి భోజనం చేసే శీను అదిరింది. అలాగే చివర 20 నిముషాలు థియేటర్ లో వణుకు పుట్టించే అద్భుత నటనతో రిషబ్ శెట్టి అందరినీ అలరిస్తాడు. ప్రేక్షకుల్ని మంత్రం ముగ్దుల్ని చేసి, పూనకాలు తెప్పించేటంతగా తన నటనతో మెప్పిస్తాడు శివ. ప్రభాస్ అన్నట్టు ఇది థియేటర్ లో మాత్రమే చూడాల్సిన సినిమా. ఇంకా నటీనటులు విషయానికి వస్తే శివ గా రిషబ్ శెట్టి చాల అద్భుతంగా చేసాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో నర్తకుడి వేషం లో అసలు ఇది రిషబ్ తప్పితే వేరేవాళ్లు చెయ్యలేరు అనే భావన కలిగేట్టు అంత బాగా చేసాడు. ప్రేక్షకుల్ని మైమరిపించాడు. సప్తమి గౌడ ఆమె పాత్రకి తగినట్టుగా చాల బాగా చేసింది. కిశోర్ కి మంచి పాత్ర దొరికింది ఇందులో, ఫారెస్ట్ ఆఫీసర్ గా చాల చక్కగా చేసాడు. తన కెరీర్ లో గుర్తుంది పోయే పాత్ర కిశోర్ ది. అచ్చుత కుమార్ గ్రామా పెద్దగా సరిగ్గా అమిరాడు. అలాగే చాలామంది వున్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చిన పాత్రలన్నీ చాల సహజంగా వుండేటట్టు చేసారు. ఆలా చెయ్యడం వల్లే ఈ సినిమా అంత సహజంగా ఉండటానికి దోహదపడింది.
ఇంకా ఈ సినిమాకి సంగీతం అందించిన అజనీష్ లోక్‌నాథ్‌ (Ajaneesh Loknath) ఒక హైలైట్, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. దానివల్లనే సినిమాకి ప్రతి సన్నివేశం లోనూ బాగా హైప్ వచ్చింది. అలాగే పోరాట సన్నివేశాలు కూడా చాలా బాగా కోరియోగ్రాఫ్ చేసారు. మొదట్లో వచ్చే పరుగు పందెం చాల బాగుంటుంది. డైలాగ్స్ సన్నివేశానికి తగ్గట్టుగా బాగున్నాయి. దీనిలో వేరే హాస్య సన్నివేశాలు ఏమీ పెట్టకుండా, కథలోనే అప్పుడప్పుడు కొన్ని సన్నివేశాలు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. చివరగా, ‘కాంతారా’ సినిమా రిషబ్ శెట్టి ప్రతిభకు నిదర్శనం. ఒక్కడే తన భుజస్కంధాల మీద ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాడు. సంగీతం, పోరాట సన్నివేశాలు, సహజత్వం ఉట్టిపడే సన్నివేశాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే,చివర 20 నిముషాలు మాత్రం ఒక అద్భుత దృశ్యం చూస్తున్నట్టుగా ఉంటుంది. తప్పకుండ చూడాల్సిన సినిమా ఇది.