BiggBoss Non Stop: బిగ్ బాస్ ఓటీటీ 24/7 బిస్కేట్.. అరగంట చూడటమే ఎక్కువ.. పసలేదూ!

Share This :

అసలే బిగ్ బాస్.. ఓ గంట షో చూడాలంటేనే అబ్బో అనే వాళ్లు చాలామంది ఉంటారు.. అలాంటిది.. 24 గంటలూ ఏకదాటిగా లైవ్ అంటే.. మామూలు బిగ్ బాస్ తెలుగు రోజులో గంట వచ్చే షోనే బండ బూతులు తిట్టేవారు. ఆ సీపీఐ నారాయణ అయితే ఏకంగా బిగ్ బాస్ హౌస్‌ని అదేదో హౌస్ అని దారుణంగా మాట్లాడారు. పాఫం పాలిటిక్స్ మాట్లాడితే జనం పట్టించుకోవడం లేదని.. బిగ్ బాస్ మీద పడ్డారో ఏమో కానీ.. సీజన్ వచ్చిందంటే చాలు కామెంట్స్ చేస్తూ వీడియోలు వదలుతుంటారు. పాఫం తమన్నా సింహాద్రి అయితే పో పోవయ్యా నారాయణా.. నచ్చకపోతే ఛానల్ మార్చుకో.. ఎక్స్ ట్రాలు మాట్లాడితే చెప్పుదెబ్బలు తింటావ్ అని వార్నింగ్ ఇచ్చేసింది. వాళ్ల సంగతి పక్కనపెడితే.. ఇప్పుడు బిగ్ బాస్ 24*7 అంటూ తెలుగులో ఆట మొదలైపోయింది. మొత్తం 17 మందిని హౌస్‌లోకి పంపేశారు. వారియర్స్, ఛాలెంజర్స్ అని రెండు గ్రూపులుగా విడగొట్టి తన్నుకుచావమని మంటపెట్టేశారు బిగ్ బాస్. ఇక తొలివారం నామినేషన్స్ కూడా ప్రారంభమైపోయాయి. ఏడుగుర్ని నామినేట్ చేశారు. వారిలో ఆ మిత్ర బింద బ్యాగ్ సర్దించేస్తున్నారనే టాకూ.

సర్లే ఆ ఓటింగ్ ఫైటింగ్‌లలో నిఖార్సు ఉండదు కానీ.. కావాలనుకున్న వాళ్లని ఉంచుకుని వద్దన్న వాళ్లని బయటకు పంపేస్తుంటారు. ఈ నామినేషన్స్, ఎలిమినేషన్స్, ఓటింగ్ లాంటివన్నా పెద్ద డ్రామా కంపెనీలకు కేరాఫ్ అడ్రస్‌లే. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ అంటే పరమబోరింగ్ కాన్సెప్ట్ అనేవాళ్లు చాలామంది ఉంటారు. దీన్ని ఎంజాయ్ చేసే వాళ్లు ఎంతమంది ఉంటారో.. నారాయణలా బండబూతులు తిట్టేవాళ్లు ఉంటారు.

ఆ సోది ముఖాల్ని ఏం చూస్తాం రా బాబూ.. ఆ కొట్టుకుని తిట్టుకోవడం.. ఆ సోది యవ్వారాలు మనకి అవసరమా? ఛల్ ఛానల్ మార్చు అనేవాళ్లూ ఉంటారు. ఓ గంట షో వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంటే.. 247 ఏకదాటిగా 84 రోజులు లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. బిగ్ బాస్ చూసే శక్తి లేదనే వాళ్లు ఎంతమంది అయితే ఉంటారో.. ఆసక్తి చూపించేవాళ్లూ ఉంటారు. అయితే ఒక గంట అయితే సరేసరి.. ఆ కొట్లాటలు తిట్టుకోవడాలు చూడ్డానికి రెడీ అనేవారు. అయితే ఇప్పుడు ఏకంగా 247 దబిడిదిబిడి యవ్వారం పెట్టారు. పొరపాటు లైవ్ చూద్దాంలే అని చూస్తుంటే.. ఆ సోదిని తట్టుకోవడం మా వల్ల కాదు బాబోయ్ చేతులు ఎత్తేస్తున్నారు.

కామన్ వ్యూవర్స్ మాత్రమే కాదు.. బిగ్ బాస్ ఫాలో అయ్యి రివ్యూలు ఇచ్చేవాళ్లు కూడా తలలుపట్టుకునే పరిస్థితి? ఏం చూడాలో తెలియదు.. ఎక్కడ చూడాలో తెలియదు.. పోనీ పాస్ చేసి ముందుకు వెళ్లడానికి లేదు.. అలాగని వెనుక ఏమైందో చూద్దాం అన్నా లేదు.. చచ్చినట్టు వాళ్లు చూపించింది చూస్తూ పోవాలి. దీంతో ఈ తలపోటు యవ్వారం మన వల్ల కాదులే అని.. ఉదయం సాయంత్రం ఎడిట్ చేసి అప్ లోడ్ చేస్తున్న హైలైట్స్‌నే చూసేవాళ్లు చూస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభమై రెండే రోజులైనా తెలుగులో పెదవివిరుపులు ఎక్కువయ్యాయి. ఇంకా విచిత్రం ఏంటంటే.. బిగ్ బాస్ వస్తుందా? అని విచిత్రంగా అడిగేవాళ్లు ఉన్నారంటే.. ఈ ఓటీటీ షోపై తెలుగు ఆడియన్స్‌లో ఆసక్తి ఎంత సన్నగిల్లిందో అర్ధం చేసుకోవచ్చు. 84 రోజులని ముందే అనౌన్స్ చేసేశారు కాబట్టి.. తప్పదన్నట్టు నడిపించాల్సిందే మరి. హౌస్‌లో 17 మంది కంటెస్టెంట్స్ ఉంటే.. కనీసం వాళ్ల ఇంట్లో వాళ్లైనా ఈ 24 గంటల ప్రసారం చూస్తున్నారా? అంటే ఖచ్చితంగా చూడరు.. చూడలేరు.. ఇక సగటు ఆడియన్స్ ఏం చూస్తారు లెండి.. చూద్దాం ఏమైనా కంటెంట్ బలపడి తెలుగు ఆడియన్స్‌ని రంజింపజేస్తుందేమో.

2 Comments

  1. I was extremely pleased to discover this page. I want to to thank you for ones time due to this wonderful read!! I definitely appreciated every part of it and I have you bookmarked to look at new information on your web site.

  2. Im excited to discover this web site. I need to to thank you for ones time for this wonderful read!! I definitely savored every bit of it and I have you bookmarked to look at new information in your web site.

Comments are closed.