Movie Lovers

BIGG BOSS: మహేష్ విట్టా పెళ్లి.. నాడు రిజెక్ట్ చేసిన ఐటీ అమ్మాయితోనే ముహూర్తం ఫిక్స్

Share This :

Mahesh Vitta Love Story: రాయలసీమ యాసతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని సంపాదించుకున్న నటుడు మహేష్ విట్టా. ఫన్ బకెట్‌తో పాపులర్ అయిన మహేష్ విట్టా బిగ్ బాస్‌తో సెలబ్రిటీ అయిపోయారు. సీజన్ 4 కంటెస్టెంట్‌గానే కాకుండా.. ప్రజెంట్ నడుస్తున్న ఓటీటీకి కంటెస్టెంట్‌గా వెళ్లారు మహేష్ విట్టా.
ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ సినిమా ఆఫీస్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేసి కమెడియన్ మహేష్ విట్టా.. ఇప్పుడు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ పెట్టి సినిమాలు తీసే రీంజ్‌కి ఎదిగాడు. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్‌గా అలరించి.. ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ ఓటీటీ ద్వారా రెండో సారి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాడు. అయితే బిగ్ బాస్‌కి వెళ్లడానికి ముందు మహేష్ విట్టా తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ తన లవ్ స్టోరీని బయటపెట్టారు.
‘నాలుగేళ్లుగా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా.. ఇద్దరం రిలేషన్‌లో ఉన్నాం.. నాకు లవ్ గురించి పెద్దగా ఏమీ తెలియదు. ఆ మనిషి మన పక్కన ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. తను లేకుంటే ఏంటి అని ఆలోచించినప్పుడే తన వాల్యూ ఏంటో తెలుస్తుంది. తను లేకుండా జీవితమే లేదనుకోవడమే కదా.. నిజమైన లవ్ అంటే.. త్వరలోనే నా పెళ్లి ఉండబోతుంది. నా సొంత ప్రొడక్షన్స్‌లో వస్తున్న సినిమా రిలీజ్‌ కాగానే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. ఆగష్టు, సెప్టెంబర్ నెలలో పెళ్లికి ప్లాన్ చేస్తున్నాం.

తాను ఐటీ ఉద్యోగి.. ఇండస్ట్రీతో సంబంధమే లేని అమ్మాయి. మా చెల్లెలి ఫ్రెండ్ తను. అలా మా ఇద్దరికీ లైన్ కుదిరింది. ఆమెను ఫస్ట్ టైం చూసినప్పుడు మా అమ్మ ఫేస్ కట్ కనిపించింది.. నాకు కనెక్ట్ అయిపోయింది.. వెంటనే ప్రపోజ్ చేశా. తాను రిజెక్ట్ చేసింది. రెండుసార్లు కలిశాం.. అప్పుడే లవ్ ఏంటి అని అన్నది. ఆ తరువాత ఫ్రెండ్స్‌గా ఉన్నాం.. రెండేళ్ల తరువాత నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమె పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. మా ఇంట్లో.. వాళ్ల ఇంట్లో ఓకే చెప్పేశారు.. మా ఊరిలోనే పెళ్లి చేసుకోబోతున్నాం’ అంటూ తన లవ్ మ్యారేజ్‌పై క్లారిటీ ఇచ్చారు మహేష్ విట్టా.
ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఓటీటీకి కంటెస్టెంట్‌గా వెళ్లిన మహేష్ విట్టా.. ఈసారి ఎలాగైనా కప్పుకొట్టాలనే కసితో వెళ్లినట్టు చెప్పాడు. ప్రస్తుతం తొలివారం కెప్టెన్ రేస్‌లో ఉన్నాడు మహేష్ విట్టా. చూద్దాం ఈసారైనా టైటిల్ గెలుస్తాడేమో.