
శర్వానంద్, రీతు వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఒకే ఒక జీవితం’ చిత్రం నుంచి విడుదలైన ‘అమ్మ’ సాంగ్ ఎంతో వినసొంపుగా ఉంది. అమ్మతనంలో ఉన్న పేగు బంధాన్ని గుర్తుచేస్తూ.. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన ఈ అమ్మ పాటలో కమ్మనైన సాహిత్యం ఉంది.
‘అమ్మ’ మాటలో ఉన్నంత కమ్మదనం ఉంది ఈ పాటలో. సిరివెన్నెల సీతారామశాస్త్రి లేకపోయినా ఆయన పాటరూపంలో బతికే ఉన్నారని చెప్పే పాటే ఈ అమ్మ పాట. శర్వానంద్, రీతు వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలో నుంచి ‘అమ్మ’ సాంగ్‌ని బుధవారం నాడు విడుదల చేశారు. సంచలన గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకి ‘జేక్స్ బెజోయ్’ స్వరాలను సమకూర్చారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. మళ్లీ మళ్లీ వినాలనిపించే వినసొంపైన ఈ అమ్మ పాట లిరిక్స్ మీకోసం..
MOVIE : OKE OKA JEEVITHAM
SONG : AMMA SONG
MUSIC : JAKES BEJOY
SINGER : SIS SRIRAM
LYRICS : SIRIVENNELA SEETHARAMA SASTRY
అమ్మా!! వినమ్మా.. నేనాటి నీ లాలి పదన్నే
ఓ!! ఔనమ్మా.. నేనేమ్మా.. నువ్ ఏనాడో కనిపెంచిన స్వరాన్నే
మౌనమై ఇన్నాళ్లూ నిదరలోనే ఉన్నా..
గానమై ఈనాడే మేలుకున్నా..
నీ పాదాలకు మువ్వల్లా నా అడుగులు సాగాలమ్మా..
నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా..
నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ..
నిన్నొదిలేంతగ ఎదగాలనుకోనే అమ్మా….
అణువణువు నీ కొలువే అమ్మా..
ఎదసడిలో శ్రుతిలయలు నువే అమ్మా..
అమ్మా.. నే కొలిచే శారదవే
నను నిత్యం నడిపే సారధివే
బెదురుపోవాలంటే నువ్వు కనిపించాలి
నిదరావాలంటే కథలు వినిపించాలి
ఆకలయ్యిందంటే నువ్వెతినిపించాలి
ప్రతి మెతుకు నా బతుకు అనిపించేలా..
నువ్వుంటేనే నేనూ..
నువ్వంటేనే నేనూ..
అనుకోలేకపోతే ఏమైపోతాను
నీ కడ చూపే నన్ను కాస్తూ ఉండక
తడబడి పడిపోనా చెప్పమ్మా
మరి మరి నునునువు మురిపెంగా చూస్తూ ఉంటే చాలమ్మా
పరిపరి విధముల గెలుపులుగా పైకెదుగుతు ఉంటానమ్మా..
అయినా సరే ఏనాటికీ ఉంటాను నీ పాపాయినై
నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే
నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ..
నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ..
నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ..
నిన్నొదిలేంతగ ఎదగాలనుకోనే అమ్మా….
అణువణువు నీ కొలువే అమ్మా..
ఎదసడిలో శ్రుతిలయలు నువే అమ్మా..
అమ్మా.. నే కొలిచే శారదవే
నను నిత్యం నడిపే సారధివే
I was extremely pleased to discover this page. I want to to thank you for ones time due to this wonderful read!! I definitely appreciated every part of it and I have you bookmarked to look at new information on your web site.
Im excited to discover this web site. I need to to thank you for ones time for this wonderful read!! I definitely savored every bit of it and I have you bookmarked to look at new information in your web site.