Movie Lovers

మహేశ్ మూవీలో కన్నడ స్టార్..?

Share This :

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించబోతున్న లేటెస్ట్ మూవీలో కన్నడ స్టార్ హీరో కీలక పాత్రలో నటించబోతున్నారని తాజా సమాచారం. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ – 14 రీల్స్ – మైత్రీ మూవీ మేకర్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు వచ్చి సాలీడ్ రెస్పాన్స్‌ను తెచ్చుకున్నాయి. ఈ సినిమాను మే 12న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.
దీని తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా మొదలవబోతోంది. ఇప్పటికే అధికారికంగా ఈ సినిమాను ప్రకటించారు. అయితే, తాజా సమాచారం మేరకు కన్నడ స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో కీలక పాత్రకు ఎంపికయ్యారట. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా నుంచి ఉపేంద్ర అప్పుడప్పుడు తెలుగు సినిమాలలో కీలక పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం గని లోనూ ఆయన ఓ ముఖ్య పాత్రను పోషించారు. ఈ క్రమంలోనే మహేశ్ బాబు సినిమాలో ఓ రోల్ చేసేందుకు ఒకే చెప్పారట. త్వరలో దీనిపై అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానున్నట్టు సమాచారం.