హాట్‌ బ్యూటీ సరయు అరెస్ట్‌!

Share This :

యూట్యూబ్‌ హాట్‌ బ్యూటీ సరయూను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో సరయు స్నేహితులు కొందరు సిరిసిల్లలో 7 ఆర్ట్స్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌ ప్రారంభించారు. ఇందుకోసం సరయు ఓ లఘు చిత్రం రూపొందించారు. ఆ వీడియో గతేడాది ఫిబ్రవరిలో 7 ఆర్ట్స్‌ యూట్యూబ్‌ ఛానెల్‌, అనేక సోషల్‌ మీడియా మాధ్యమాల్లో విడుదల చేయగా వైరల్‌ అయింది. ఆ వీడియోలో కంటెంట్‌ హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచే విధంగా ఉందని విశ్వ హిందూ పరిషత్‌ రాజన్న సిరిసిల్ల పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతోపాటు మద్యం తాగి హోటళ్లకు వస్త్తారనే దుష్ప్రచారం అవుతోందని రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు చేపూరి అశోక్‌ అక్కడి పోలీసులకు పిర్యాదు చేశారు. కేసుపై విచారణ చేపట్టిన బంజారాహిల్స్‌ పోలీసులు ‘7 ఆర్ట్స్‌’ బృందం అరెస్ట్‌ చేశారు. మంగళవారం మరోసారి విచారణకు హాజర్‌ కావాలని సూచించారు.