వరుసగా విడుదలకు సిద్ధమవుతున్న చిత్రాలు

Share This :

తమిళ నాడు రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రభావం క్రమంగా తగ్గుతుండడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ జనజీవన పరిస్థితులు క్రమంగా పుంజుకుంటున్నాయి. అదేవిధంగా చిత్రపరిశ్రమలో కూడా పలు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల మొదటి శుక్రవారమైన నాలుగో తేదీ నుంచి ఒక్కో చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఈ నెల 4న హీరో విశాల్‌ నటించిన ‘వీరమే వాగై సూడుమ్‌’ థియేటర్‌లో విడుదలకానుంది. ప్రస్తుతం థియేటర్లలో 50 శాతం సీటింగ్‌ ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ నిర్మాతలు ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 11న విజయ్‌ సేతుపతి నటించిన ‘కడైసి వివసాయి’ చిత్రం విడుదలకానుంది. వీటితోపాటు మరికొన్ని చిత్రాలు కూడా విడుదల కానున్నాయి.