
వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా నటించిన చిత్రం ‘ఎఫ్ 3’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. తమన్నా, మెహరీన్ కథానాయికలు. శిరీష్ నిర్మాత. ఈ చిత్రంలోని తొలి పాట ‘లబ్‌డబ్ లబ్‌డబ్ డబ్బు’ని సోమవారం విడుదల చేశారు. భాస్కర భట్ల రవికుమార్ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని రామ్ మిరియాల పాడారు. దేవిశ్రీ సంగీతం అందించారు. ఈ పాటలో ప్రధాన తారాగణం అంతా కనిపించబోతోంది. ‘ఎఫ్ 2’.. భార్యాభర్తల గిల్లికజ్జాల చుట్టూ తిరిగితే, ‘ఎఫ్ 3’ డబ్బు చుట్టూ తిరగబోతోంది. సునీల్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.