మళ్లీ ప్రేమలో హృతిక్ రోషన్.. ప్రియురాలు ఎవరంటే..!

Share This :

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడు. కొత్త లవర్‌ని వెతుక్కున్నాడు. సుసానే ఖాన్ నుంచి అతడు కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. అనంతరం అర్స్లాన్ గోనితో సుసానే డేటింగ్ చేయడం మొదలుపట్టింది. కానీ, హృతిక్ మాత్రం ఒంటరి జీవితాన్ని గడుపుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక బాలీవుడ్ బ్యూటీతో డిన్నర్ చేసేందుకు బయటకు వచ్చాడీ బీ-టౌన్ అందగాడు. ఈ క్రమంలోనే మీడియా కంటపడ్డాడు. దీంతో బాలీవుడ్ మీడియా ఎవరా అమ్మాయి అని ఆరా తీయడం మొదలుపెట్టింది. చివరకు ఆమె సబా ఆజాద్ అనే ఓ బాలీవుడ్ తార అని బీ టౌన్ మీడియా కనిపెట్టింది.

హృతిక్ రోషన్ మాములుగా అయితే తన వ్యక్తిగత జీవితం గురించి బయటకు వెల్లడించడానికి ఇష్టపడడు. సబా ఆజాద్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్న విషయాన్ని మాత్రం బయట పెట్టాలని అతడు ఆలోచిస్తున్నాడట. అందుకే ఆమెతో కలిసి బయటకు వచ్చినట్టు సమాచారం. హృతిక్ రోషన్ సన్నిహిత మిత్రుడు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ‘‘హృతిక్ రోషన్ బాలీవుడ్ తార సబా ఆజాద్‌తో గత కొంతకాలంగా రిలేషన్ షిప్‌ను కొనసాగిస్తున్నాడు. బహిరంగంగా ఈ విషయాన్ని ప్రకటించాలని భావిస్తున్నాడు. సుసానే తన దారి తను చూసుకుంది. హృతిక్ కూడా కొత్త భాగస్వామిని వెతుక్కున్నాడు’’ అంటూ హృతిక్ సన్నిహిత మిత్రుడు తెలిపాడు.