బెంగళూర్‌కు పయనమవుతున్న అల్లు అర్జున్

Share This :

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇటీవల ‘పుష్ప’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. త్వరలో ‘పుష్ప’ రెండో భాగం షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించిన పునీత్ రాజ్ కుమార్‌.. కుటుంబాన్ని ‘పుష్ప’ షూటింగ్ బిజీలో బన్నీ పరామర్శించడం వీలుపడలేదు. అందుకే ఈరోజు పునీత్ కుటుంబాన్ని పరామర్శించడానికి బెంగళూరు పయనమవుతున్నారు. ముందుగా శివ రాజకుమార్ ని కలిసి పునీత్ కుటుంబసభ్యుల్ని పరామర్శించి, పునీత్ సమాధి ని సందర్శిస్తారు. సుమారు 10.30 నిమిషాలకి హైదరాబాద్ నుండి బయలుదేరుతారు అల్లు అర్జున్.

2 Comments

Comments are closed.