బాలీవుడ్ ‘డీజే’ ఇతడేనా?

Share This :

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హరీశ్ శంకర్ తొలి కాంబినేషన్‌లోని చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’. ‘డీజే గానూ, దువ్వాడ జగన్నాథం’ గానూ రెండు వేరియేషన్స్ చూపించిన బన్నీ ఈ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. పూజా హెగ్డే గ్లామర్ అపీరెన్స్, రావు రమేశ్ అభినయం సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడీ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నట్టు సమాచారం. అయితే బన్నీ పాత్రను అక్కడ రక్తికట్టించే హీరో ఎవరా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ హీరో ఎవరనేది ఖాయమైందని టాక్.

బాలీవుడ్ యంగ్ క్రేజీ హీరో సిద్ధార్ధ మల్హోత్రా ‘డీజే’ గా నటించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు హరీశ్ శంకరే హిందీ వెర్షన్ ను డైరెక్ట్ చేయబోతున్నాడట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా .. ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాను హరీశ్ డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలవడానికి బాగా సమయం పట్టేలా ఉంది. అందుకే ఈ గ్యాప్ లో బాలీవుడ్ డీజేను డైరెక్ట్ చేయబోతున్నాడట హరీశ్ శంకర్ . ముందు ఈ సినిమా తీసి.. ఆ తర్వాత ‘భగత్ సింగ్’ సినిమా పనులు మొదలు పెడతాడట హరీశ్ శంకర్. ఆల్రెడీ ఈ సినిమా స్ర్కిప్ట్ ఎప్పుడో లాక్ చేశారు. త్వరలోనే బాలీవుడ్ ‘డీజే’ సెట్స్ పైకి వెళ్ళబోతోంది.