‘ది వారియర్’ భారీ ధరకు డిజిట‌ల్, శాటిలైట్ రైట్స్……?

Share This :

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది వారియ‌ర్‌’. ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్టు సమాచారం. తమిళ డైరెక్టర్ ఎన్‌.లింగుసామి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో కనిపించబోతున్నాడు. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ ప‌తాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతి శెట్టి కథానాయికగా, ఆది పినిశెట్టి విలన్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుద‌లైన పోస్టర్స్‌కు విశేష స్పందన లభించింది.
అయితే, తాజాగా ‘ది వారియ‌ర్‌’ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ మూవీకి సంబంధించిన డిజిట‌ల్, శాటిలైట్ రైట్స్ రెండూ క‌లిపి దాదాపు రూ. 35 కోట్ల‌కు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. కానీ, దీనిపై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా, ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

3 Comments

  1. I was extremely pleased to discover this page. I want to to thank you for ones time due to this wonderful read!! I definitely appreciated every part of it and I have you bookmarked to look at new information on your web site.

  2. May I simply say what a relief to uncover somebody that really understands what theyre discussing over the internet. You certainly know how to bring a problem to light and make it important. More and more people really need to check this out and understand this side of the story. I was surprised that youre not more popular because you certainly have the gift.

  3. Im excited to discover this web site. I need to to thank you for ones time for this wonderful read!! I definitely savored every bit of it and I have you bookmarked to look at new information in your web site.

Comments are closed.