“కెజీఎఫ్ 2” ట్రైలర్ వచ్చేస్తోంది !

Share This :

కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కేజీఎఫ్ 2’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ ‘కేజీఎఫ్’ కు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడదలైన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై.. దేశవ్యాప్తంగా కలెక్షన్ల కుంభవృష్టి కురిపించింది. ‘బాహుబలి’ తర్వాత అంతటి సక్సెస్ ఫుల్ చిత్రంగా ప్రశంసలందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి రెండో భాగమైన ‘కేజీఎఫ్ 2’ కి సమయం ఆసన్నమైంది. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. రీసెంట్ గా ఈ సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పులేదని నిర్మాతలు ఖచ్చితంగా చెప్పేశారు. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు.
మార్చ్ 27 సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు ట్రైలర్ లాంఛ్ కాబోతోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కోలార్ బంగారు గనుల మాఫియా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. మొదటి భాగంలో గరుడ రామ్ విలన్ గా నటించగా.. రెండో పార్ట్ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అధిరా అనే పాత్రలో పవర్ ఫుల్ విలన్ గా మెప్పించబోతున్నారు. అలాగే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టండన్ మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇదివరకు విడుదలైన టీజర్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో .. ట్రైలర్ ఇంకే రేంజ్ లో ఉంటుందో అనే ఆత్రుతతో ఉన్నారు అభిమానులు. మరి ట్రైలర్ ను ఎంత పవర్ ఫుల్ గా కట్ చేస్తారో చూడాలి.

3 Comments

  1. I was extremely pleased to discover this page. I want to to thank you for ones time due to this wonderful read!! I definitely appreciated every part of it and I have you bookmarked to look at new information on your web site.

  2. May I simply say what a relief to uncover somebody that really understands what theyre discussing over the internet. You certainly know how to bring a problem to light and make it important. More and more people really need to check this out and understand this side of the story. I was surprised that youre not more popular because you certainly have the gift.

  3. Im excited to discover this web site. I need to to thank you for ones time for this wonderful read!! I definitely savored every bit of it and I have you bookmarked to look at new information in your web site.

Leave a Reply

Your email address will not be published.