కార్తీ జోడీగా సామ్ ?

Share This :

తమిళ స్టార్ హీరో కార్తీ.. గతేడాది ‘సుల్తాన్’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు. సినిమాకి మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ ఏడాది ‘సర్దార్, విరుమాన్, పొన్నియన్ సెల్వన్’ చిత్రాల్లో నటిస్తున్నాడు. మరిన్ని క్రేజీ కాంబినేషన్స్ ప్లానింగ్ లో ఉన్నాయి. అందులో ఒక చిత్రంలో హీరోయిన్ గా సమంత నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అన్న సూర్య గతంలో ‘సికిందర్, 24’ చిత్రాలతో సమంతాతో జోడీ కట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమ్ముడు కూడా ఆమెతో సినిమా చేసేందుకు రెడీ అవుతుండడం విశేషం. నిజానికి ఈ కాంబో ఎప్పుడో రావాల్సింది. కొన్ని కారణాల వల్ల వర్కవుట్ అవలేదు. ఎట్టకేలకు ఇప్పుడు సెట్ అయినట్టు తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇటీవల కోలీవుడ్ లో ‘బ్యాచ్‌లర్’ అనే మూవీతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు సతీశ్ సెల్వకుమార్ దర్శకత్వంలోని సినిమాలో కార్తీ, సామ్ జంటగా నటిస్తున్నారని టాక్. త్వరలోనే సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ సినిమా తెలుగులో కూడా విడుదలవుతుంది. ప్రస్తుతం సమంత ‘శాకుంతలం, యశోద’ లాంటి తెలుగు సినిమాలతో పాటు ‘కాత్తువాక్కుల రెండు కాదల్’ తమిళ చిత్రం, తాప్సీ నిర్మాణంలో రూపొందబోయే హిందీ చిత్రంలోనూ, ఒక వెబ్ సిరీస్ లోనూ, ఒక ఇంగ్లీష్ మూవీలోనూ సమంత నటిస్తూ సత్తా చాటుతోంది. అన్న సూర్యతో మంచి సక్సెస్ అందుకున్న సామ్.. తమ్ముడు కార్తితో ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.