ఇండస్ట్రీలో నన్ను ఒక్కడు కూడా** గీతక్కాయ్!! ఊకో ఊకో బాధపడకు.. కర్మరా సామే

Share This :

అబ్బబ్బా ఆదిరెడ్డీ ఏం చెప్పావ్ అయ్యా.. తెగ నచ్చేశావ్ సుమీ.. ముళ్ళకంపని ఎవరైనా ఈపుకు తగిలించుకుంటారా? గీతు విషయంలో పర్ఫెక్ట్ పంచ్ వేశాడు. ఏంటక్కాయ్.. ఎవరు ఫ్లర్ట్ చేయలేదని చెప్పడం ఏమో కానీ.. ఫ్లర్ట్ చేయనందుకు బాధపడుతున్నట్టుగా ఉంది.. అక్కయ్య బిహేవియర్.. కెమెరా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకునేసరికి తీతక్కలోని రెండో అక్క.. రోతక్క బయటకు వచ్చేసింది.

హోస్ట్ నాగార్జున వచ్చే శని, ఆదివారాల ఎపిసోడ్‌లతో సహా మిగిలిన అన్ని రోజులు చప్పగా సాగుతుంది. వారం మొత్తం టెస్ట్ క్రికెట్ మాదిరి జిడ్డుగా సాగితే.. సోమవారం మాత్రం టీ 20 మ్యాచ్ మాదిరి ఉంటుంది (కొంతమందికే లెండి). ఎందుకంటే ఈరోజే నామినేషన్స్ రచ్చ ఉండేది. గత ఆరువారాలుగా బిగ్ బాస్ నామినేషన్స్ హీట్ పెంచుతుండగా.. ఏడోవారం నామినేషన్స్‌లో అంతా బురద బురదే. ఈ నామినేషన్స్ రచ్చకి ముందు ఏమైంది? ఎపిసోడ్ 44 హైలైట్స్ ఏంటో చూద్దాం. బిగ్ బాస్ దత్తపుత్రిక గీతు‌తోనే ఎపిసోడ్ స్టార్ట్ చేశారు.. పెద్ద మనుషులు ఆదిత్య, ఆదిరెడ్డిలతో గీతు రోత మొదలైంది. సుదీప వెళ్లిపోతే నువ్ సెట్ అయిపోతావ్ అని గీతు అన్న మాటల్ని గుర్తు చేసిన ఆదిత్య.. ఈరకంగానే నైనా నువ్వు దగ్గర అవుదాం అనుకుంటున్నా.. ఎంత ప్రేమలేకపోతే నా పెళ్లంతో మాట్లాడుతే నీ గురించి చెప్తా.. నువ్వు మాట్లాడాలి అనుకుంటే మాట్లాడు.. లేదంటే లేదు.. నీ ఇష్టం’ అని చెప్పాడు బాలాదిత్య.

మరోవైపు సూర్య, ఇనయలను స్క్రీన్‌పై చూస్తుంటేనే ఛీ అనేట్టుగా మారింది. మన కాట్రాజ్ సూర్య అయితే ఇనయ గేమ్‌ని మారుస్తా అంటూ బిగ్ బాస్ కెమెరాల ముందు కమల్ హాసన్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. నిన్న నాగార్జున ఇచ్చిన డోస్‌తో మనోడిలో కాస్త చలనం కనిపించింది. ‘నా వల్ల ఇనయ గేమ్ డిస్ట్రబ్ కావడం ఇష్టం లేదు బిగ్ బాస్.. నా వల్ల తను డిస్ట్రబ్ అయ్యిందేమో తెలియదు కానీ.. నాకు ఎక్కువ అటెన్షన్ ఇవ్వడం వల్ల తన గేమ్ డెడ్ అవ్వడం నచ్చలేదు బిగ్ బాస్.. వ్యక్తిగతంగా ఇనయ అంటే నాకు ఇష్టం బిగ్ బాస్.. ఎందుకంటే ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఇష్టం.. రెస్పెక్ట్ చేస్తా.. మా అమ్మని గానీ బుజ్జమ్మని గాని గట్టిగా పట్టుకుని ఏడ్వాలని ఉంది బిగ్ బాస్’ అని కెమెరాలు చూస్తూ పెర్ఫామెన్స్ ఇచ్చాడు మన కమల్ హాసన్.. దయచేసి సూర్య.. ఉమెన్స్ గురించి.. వాళ్ల ఇండిపెండెన్సీ గురించి కానీ.. సూర్య మాట్లాడుతుంటే భలే కామెడీగా అనిపిస్తుంది సుమీ.. ఎంత రెస్పెక్ట్‌‌నో కనిపిస్తుందిరా సామీ.. చెప్పుకోవాల్సిన పనిలేదనుకో సూర్యా!

ఇక గీతు అయితే.. అర్జున్, రేవంత్, ఆదిరెడ్డిల దగ్గర కూర్చుని.. నన్ను ఇండస్ట్రీలో ఒక్కడు కూడా.. కనీసం ఫ్లర్ట్ కూడా చేయలేదు అని ఓ రేంజ్‌లో బిల్డప్ ఇస్తూ చెప్పింది. అసలు ఫ్లర్ట్ చేసే నోరా అది.. పొరపాటున చేద్దాం అని ఈ పిచ్చిచేష్టలు చూసి పారిపోతారమ్మో అనేట్టుగా ఫేస్ పెట్టారు ఆ ముగ్గురూ. ‘నన్ను అంతా అక్కా’ అని పిలుస్తారు తెలుసా? అని చెప్పింది గీతు. ఔనా.. కారణం ఏంటంట అని మంచి ప్రశ్నవేశాడు రేవంత్. ‘నేను అందంగా లేనేమో’ అని నిజం ఒప్పేసుకుంది గీతక్క. పక్కన ఉన్న ఆదిరెడ్డి పంచ్ అయితే హైలైట్.. కంపని తెచ్చి అతికించుకోవడం ఎందుకులే అని గెలకలేదేమో అని అసలు వాస్తవం చెప్పేశాడు ఆదిరెడ్డి. నువ్వు అందంగా లేకపోవడం ఏంటి తల్లే.. నీతో పెట్టుకుంటే వాళ్లు మందంగా అయిపోతారని.. వాళ్లంతా లక్కీ ఫెలోస్ అని దిమ్మతిరిగే పంచ్ వేశాడు రేవంత్. అప్పుడు కూడా.. మళ్లీ నన్ను ఒక్కడంటే ఒక్కడు కూడా ఏం చేయాలేకపోయారని చెప్పింది గీతు. అయితే ఆమె ఎక్స్ ప్రెషన్స్ చూస్తే.. ఎవరూ ఫ్లర్ట్ చేయలేదని తెగ ఫీల్ అయినట్టుగా అనిపించింది.

అన్నట్టు ఇండస్ట్రీలో అని అంటుందేంటబ్బా.. ఆమె ఏదో సెంచరీ కొట్టిన హీరోయిన్‌లా.. ఒక్కటంటే ఒక్క సినిమాలో కనిపించిన పత్తా లేదు.. మిగిలిన వాళ్లలా సీరియల్స్ కూడా చేసింది లేదు.. యూట్యూబ్‌తో పాటు అప్పుడప్పుడు ఆ జబర్దస్త్‌లో కనిపించింది. ఆ మాత్రం దానికి తానేదో ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్ మాదిరిగా.. ఇండస్ట్రీలో నన్ను ఒక్కడు కూడా ఫ్లర్ట్ చేయలేదని చెప్పడం అతిగానే అనిపించింది. కెమెరా కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చేసరికి ఈమె నోటిలో నుంచి ఏమి వస్తుందో.. ఈమె ప్రవర్తన ఏంటో వాళ్ల బిగ్ డాడీ బిగ్ బాస్ బాస్‌కి తప్ప ఎవ్వరికీ తెలియదు. అన్నట్టు బిగ్ బాస్‌కే బాస్‌లా వ్యవహరిస్తున్న గీతుని బిగ్ బాసే కాదు.. ఇంటి సభ్యులు కూడా నామినేట్ చేయడానికి భయపడుతున్నారు. ఆమె బిగ్ బాస్ దత్త పుత్రిక.. హోస్ట్‌కి ఎంతో ఇష్టమైన కంటెస్టెంట్స్ కావడంతో ఆమెను ఎందుకు నామినేట్ చేయడం అనుకున్నారో ఏమో కానీ.. ఈవారం నామినేషన్స్‌లో ఆమె తప్ప అందరూ ఉన్నారు. కొండబాబు (ఆర్జే సూర్య) ఎలాగూ కెప్టెన్‌ కావడంతో అతను నామినేషన్స్‌లో ఉండడు. అతను ఒక వారం కెప్టెన్ కాబట్టి నామినేషన్స్‌లో లేడు కానీ.. గీతు అన్ని వారాలకు కెప్టెన్ లాంటి కెప్టెన్.. సో.. ప్రస్తుతానికి నో నామినేషన్స్.. పర్మినెంట్‌గా నో ఎలిమినేషన్ (సీజన్ అయ్యేవరకూ).

Comments are closed.