ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఆనంద్ దేవరకొండ చిత్రం

Share This :

‘దొరసాని, మిడిల్‌క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం’ లాంటి చిత్రాలతో మెప్పించిన ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం ‘హైవే’ అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. తాజాగా ఆనంద్ హీరోగా మరో సినిమా అనౌన్స్ అయింది. ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్ ను మేకర్స్ ఈ రోజు (సోమవారం) విడుదల చేశారు మేకర్స్. సినిమాకి ‘గం గం గణేశా’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. పోస్టర్ పై టైటిల్ చుట్టూ మెషిన్ గన్స్ రివీలయ్యాయి. దీన్ని బట్టి ఇదో క్రైమ్ థ్రిల్లర్ అని అర్ధమవుతోంది. హైలైఫ్ బ్యానర్ పై కేదార్ శెలగంశెట్టి, వంశీ కారుమంచి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ ఫెస్టివల్ బిగిన్స్ అని పోస్టర్ పై మెన్షన్ చేశారు మేకర్స్. ప్రేమ కథా చిత్రాలకు , కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ కు కేరాఫ్ అడ్రెస్ అయిన ఆనంద్ దేవరకొండ ఈ సినిమాతో యాక్షన్ జోనర్ లోకి అడుగుపెట్టనుండడం విశేషమని చెప్పాలి. మరి ‘గం గం గణేశా’ గా ఆనంద్ ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.