
బిగ్ బాస్‌తో ఫేమస్ అయిన అరియానా, అషు రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. బిగ్ బాస్ తర్వాత వీరికి భారీగా సినిమా అవకాశాలు వస్తాయని భావించారు కానీ.. అంత సినిమా జరగలేదు. రామ్ గోపాల్ వర్మకి వీరిద్దరూ హాట్ హాట్‌గా ఇంటర్వ్యూలు ఇచ్చినా వెండితెర అవకాశాలు మాత్రం తలుపు తట్టలేదు. కానీ బుల్లితెర, సోషల్ మీడియాలలో మాత్రం వీళ్లు రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఓ ఛానల్ నిర్వహించిన స్పెషల్ షోలో పాల్గొన్న వీరిద్దరూ ముద్దులు పెట్టుకుంటూ అందరికీ షాకిచ్చారు. ఈ ముద్దు ఫొటోలను అషు రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. దీనిపై ఇప్పుడు హాట్‌హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి.అషు షేర్ చేసిన పిక్‌లో అరియానా నడుము కనిపించేలా దేవకన్యలా ముస్తాబై ఉంది. ఆమె నడుము చూసిన అషు.. ఆగలేక ముద్దు పెట్టేసింది. అషు వంగి ముద్దు పెడుతుంటే.. అరియానా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఉంది చూశారూ! అబ్బో అది వర్ణించేది కాదు. ‘ఆ ఎక్స్‌ప్రెషన్‌కి అసలు తిరుగులేదు’ అంటూ అషు ఈ పిక్ పోస్ట్ చేసింది. దీనికి ‘‘నీకు, నీ క్రేజీనెస్‌కి కళ్లలో నీళ్లు వచ్చేస్తున్నాయే తల్లీ. పాపం అందరూ తప్పుగా అనుకుంటున్నారే.. జడ్జిమెంటల్ అవుతున్నాం. అయినా సరే.. అషూ నువ్వు మాత్రం క్రేజీ ఉమెన్ అంతే.. ’’ అంటూ అరియానా రిప్లయ్ ఇచ్చింది. ఇక ఈ పిక్కి నెటిజన్లు రియాక్ట్ అవుతున్న తీరు అయితే మాములుగా లేదు. వర్మ బాగా ఎక్కించేశాడంటూ.. నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే.